Header Banner

బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి అదిరిపోయే ఆఫర్! చౌక ధరలో ఎక్స్‌క్లూజివ్ ప్రీపెయిడ్ ప్లాన్.. అద్భుతమైన సేవలు!

  Mon Apr 14, 2025 20:46        Business

భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) యూజర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. తాజాగా వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన, అత్యంత చౌక ధరలో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో డేటాతోపాటు నిరంతర కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. దీర్ఘకాల వ్యాలిడిటీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. అంతేకాదు దీనిలో మెసేజులు, కాలింగ్త్, డేటా అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ ధర ప్రస్తుతం రూ.997కి అందుబాటులో ఉండగా, 160 రోజుల సుదీర్ఘ వ్యాలిడిటీని అందించనుంది.

రోజుకు రూ.6.23 మాత్రమే
ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు రోజుకు సుమారు రూ.6.23 మాత్రమే ఖర్చు చేస్తారని చెప్పవచ్చు. అంటే 6 రూపాయలకే డైలీ 2 జీబీ డేటాతోపాటు కాలింగ్ సౌకర్యాలు లభిస్తాయి. ఇంత తక్కువ ధరల్లో ఏ ప్రైవేట్ టెలికాం సంస్థల ప్లాన్లు కూడా లేకపోవడం విశేషం. ఉదాహరణకు రిలయన్స్ జియో రూ.999 ప్లాన్‌లో కేవలం 98 రోజుల వ్యాలిడిటీతో మాత్రమే 2GB డేటాను అందిస్తుంది. కానీ బీఎస్‌ఎన్‌ఎల్ రూ.997 ప్లాన్‌లో 160 రోజుల వ్యాలిడిటీతో 2GB డేటాను ఇస్తుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఖర్చు తగ్గిస్తూ, సేవలను మెరుగుపరచే దిశగా బీఎస్‌ఎన్‌ఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో టెలికాం సేవలను చవకగా అందించడంలో బీఎస్‌ఎన్‌ఎల్ మరోసారి ముందడుగు వేసింది.


ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!


వాణిజ్య అవసరాలకు
ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. డేటా పూర్తయిన తర్వాత కూడా 40kbps వేగంతో అపరిమిత డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇది తక్కువ వేగంతో అయినా ఇంటర్నెట్ సేవలను కొనసాగించడానికి సహాయపడుతుంది. దీంతోపాటు అపరిమిత కాలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఇది వ్యక్తిగత, వాణిజ్య అవసరాల కోసం కూడా అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు రోజుకు 100 ఉచిత SMSలు కూడా లభిస్తాయి. ఇది బ్యాంకింగ్ OTPలు, అధికారిక కమ్యూనికేషన్, వ్యక్తిగత సందేశాల కోసం ఉపయోగపడుతుంది.

ఇతర సేవలు కూడా..
రూ.997 ప్లాన్‌లో అదనంగా కొన్ని వినోద సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్ ప్రత్యేక రింగ్‌టోన్ సేవలు, హార్డీ గేమ్స్, ఛాలెంజెస్ అరీనా గేమ్స్, ఆస్ట్రోటెల్, గేమ్ఆన్, గేమియం వంటి గేమింగ్ సేవలు, లిస్టెనిన్ పాడ్‌కాస్ట్ సేవలు​ కూడా లభిస్తాయి. బీఎస్‌ఎన్‌ఎల్ దేశవ్యాప్తంగా 65,000 కంటే ఎక్కువ 4G టవర్లను ఏర్పాటు చేసింది. తద్వారా వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీ, వేగవంతమైన మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తుంది. ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేయడానికి మీరు బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్-కేర్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #BSNL #PrepaidPlan #AffordablePlans #TelecomOffers #BSNLServices